రోజు రోజుకీ ఎక్కువ అవుతున్న కరోనా ప్రభావం.. ఐపీఎల్ పై అనుమానాలు

రోజు రోజుకీ ఎక్కువ అవుతున్న కరోనా ప్రభావం.. ఐపీఎల్ పై అనుమానాలు

ఈ నెల 29 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్ నుంచే సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ కమర్షియల్ టోర్నీ తొలిసారిగా మ్యాచులను రద్దు అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నికల కారణంగ గల్ఫ్ కంట్రీస్ లో టోర్నీ షిప్ట్ చేసి మరీ ఆడించారు. కానీ, ఈ ఏడాది అసలు ఐపీల్ ఉంటుందా? పూర్తిగా రద్దు అవుతుందా? అనేది సస్పెన్స్ గా మారింది. కరోనా ప్రభావం రోజు రోజుకీ ఎక్కువ అవుతుండటం ఐపీఎల్ పై అనుమానాలు రేకెత్తిస్తోంది.

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటున్న నిర్ణయాలు ఐపీఎల్ కు అడ్డంకిగా మారాయి. ఏప్రిల్ 15 వరకు వీసాల జారీపై ఆంక్షలు విధించింది. దీంతో ఫారెన్ ప్లేయర్స్ వీసాపై డౌట్స్ నెలకొన్నాయి. దీనికితోడు లేటెస్ట్ గా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బీసీసీఐ సహా జాతీయ క్రీడా సమాఖ్యలకు కొన్ని డైరెక్షన్స్ సూచించింది. ఏప్రిల్ 15 వరకు స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ ఉంటుందా? లేదా ? అనేది డౌట్ గా మారింది.

అయితే.. ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ నిర్ణయం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. అయితే..రద్దు చేయలేని పరిస్థితే ఉంటే, ఆడియన్స్ ని అనుమతించకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని కూడా కేంద్ర క్రీడా శాఖ సూచించింది. అయితే..మొత్తానికే టోర్నీ రద్దు చేయటం కన్నా ఖాళీ స్టేడియంలో మ్యాచులను నిర్వహించటమే మంచిదని ఐపీఎల్ పాలక మండలి యోచిస్తోంది. అయితే.. ఐపీఎల్ లో పాల్గొనే దాదాపు 60 మంది ప్లేయర్స్ విదేశీ వీసా కోటా కిందకే వస్తారు. దీంతో వారి వీసాల మంజూరిపై కూడా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర ఐపీఎల్ మ్యాచులు వద్దని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మొత్తానికే రద్దు అయ్యే అవకాశాలు లేకపోలేదు.

Tags

Read MoreRead Less
Next Story