కరోనా కట్టడికి సుప్రీంకోర్టు చర్యలు

కరోనా కట్టడికి సుప్రీంకోర్టు చర్యలు

కరోనా వైరస్ ప్రభావం దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా పడింది. వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యలపై చీఫ్ జస్టిస్‌ బోబ్డే స్వయంగా దృష్టి సారించారు. కోర్టు హాళ్లు, కారిడార్లలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్‌, జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావుతో కలిసి ఆయన కోర్టు పరిసరాలను ‌పరిశీలించారు. కోర్టు కారిడార్‌లో కిక్కిరిసిన పరిస్థితులపై పలువురు అడ్వకేట్లతో మాట్లాడారు. సొలిసిటర్‌ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ రోహత్గీ, మాజీ అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మనీందర్‌సింగ్‌తోనూ చీఫ్ జస్టిస్ సమాలోచనలు జరిపారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

కోర్టులను కొంతకాలం మూసివేస్తే మంచిదని మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సూచించారు.సర్వోన్నత న్యాయస్థానంలోని కోర్టు-3 బయటఉన్న జన సమూహాన్ని చూపించారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష పిటిషన్‌ విచారణ జరుగుతోంది. అత్యవసర కేసులు మాత్రమే విచారణకు తీసుకోవాలని రోహత్గీ చెప్పారు. అందుకు రెండు కోర్టులు మాత్రమే పనిచేస్తే చాలని అన్నారు. ఇలా చేస్తే క్రౌడ్‌ను కొంత వరకైనా నియంత్రించవచ్చని చెప్పారు రోహత్గీ.

సోమవారం నుంచి అత్యవసర కేసులను, తక్కువ బెంచ్‌లతో మాత్రమే విచారిస్తోంది సుప్రీంకోర్టు. తదపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం లాయర్లు, కక్షిదార్లు తప్ప మిగిలినవారని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. వైద్య నిపుణులతో చర్చించి.. వారం వారం పరిస్థితిని సమీక్షిస్తాని ఇప్పటికే స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

Tags

Read MoreRead Less
Next Story