అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష దాటాయి. ఇప్పటికి లక్షా 4 వేల 615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్షణక్షణానికీ పెరుగుతున్న కేసులతో అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. అటు.. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో చైనాను ఇటలీ అధిగమించింది. ఇటలీలో 86 వేల 498 కేసులు నమోదవగా.. చైనాలో 81 వేల 394 కేసులు నమోదయ్యాయి. , స్పెయిన్లో 65 వేల 719, జర్మనీలో 50 వేల 871 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 27 వేల 403 కొవిడ్‌ మరణాలు సంభవించాయి, ఇందులో 9 వేల 134 మరణాలతో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులోనే దాదాపు లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story