రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: టీకాంగ్రెస్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: టీకాంగ్రెస్

ఉద్యోగులు, పెన్షనర్లకు కోతలు విధించడంపై టీకాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ పై మండిపడుతున్నారు.వారం రోజుల లాక్‌డౌన్‌కే ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తారా అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి పూర్తి వేతనాలతో పాటు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

మరోవైపు ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకునే సీఎం యత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాల్సి వస్తే.. వారితో చర్చించి ఉండాల్సిందన్నారు. అటు ఇదే అంశంపై స్పందించిన వీహెచ్ కరోనా సాకుతో ఉద్యోగుల జీతాలో కోత విధించడం సరికాదని తప్పుబట్టారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఎలా కట్ చేస్తారు? అని వీహెచ్ పశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story