కరోనా కట్టడికి ఇస్తున్న విరాళాలపై పన్ను మినహాయింపు

కరోనా కట్టడికి ఇస్తున్న విరాళాలపై పన్ను మినహాయింపు

కరోనా కట్టడి కోసం విరాళాలు ప్రకటిస్తున్న వారి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కేర్స్ విరాళాలను ఇస్తున్న మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కిందికి తీసుకొస్తూ కేంద్ర ఆర్డినెన్స్ జారీ చేసింది. జూన్ 30 వరకు ఈ నిధికి విరాళాలు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు 2019-20 ఆర్ధిక సంవత్సరపు ఆదాయం నుంచి మినహాయింపు కోరవచ్చునని ప్రభుత్వం తన ఆర్డినెన్స్‌లో పేర్కొంది.

కరోనా కోరల నుంచి దేశాన్ని కాపాడటం కోసం పలువురు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పన్ను మినహాయింపు లభించటంతో విరాళాలు ఇంకా పెద్దమొత్తంలో వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story