ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ డ్రింక్ తాగండి.. చేసుకోవడం చాలా ఈజీ

ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ డ్రింక్ తాగండి.. చేసుకోవడం చాలా ఈజీ

ఇమ్యూనిటీ.. అదేనండి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే పక్కవారికి జలుబు వస్తే చాలు మనకీ వచ్చేస్తుంది. నాలుగు వర్షపు చినుకులు నెత్తిమీద పడ్డా తుమ్ములు.. తెల్లారిపాటికి జ్వరం వచ్చి ముసుగు పెట్టాల్సి వస్తుంది. అందుకే రోజు కాస్త అల్లం, మిరియాలు, నిమ్మరసం, పసుపు, వెల్లుల్లి, వాము లాంటివి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది. టీలో పంచదార వాడకాన్ని తగ్గించి బెల్లం వాడడం వంటివి చేస్తుండాలి. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుకునే జ్యూస్ ఒకటి మనం ఇంట్లోనే తయారు చేసుకుని వారానికి ఓ మూడు నాలుగుసార్లైనా తాగితే బావుంటుంది. ఎలాంటి వైరస్ వచ్చినా తట్టుకునే శక్తి మన శరీరానికి వుంటుంది. మరి ఆ జ్యూస్ గురించి తెలుసుకుందాం. ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు: అల్లం చిన్న ముక్క, గుప్పెడు పుదీనా ఆకులు, నిమ్మకాయ రసం కొద్దిగా, కీరదోస చిన్నది, చిటికెడు నల్ల ఉప్పు లేదా చాట్ మసాలా. ఇవన్నీ ఓ గ్లాస్ నీళ్లు పోసి మిక్సీలో వేయాలి. వడకట్టి తాగడమే. ఇలా ఈ సమ్మర్‌లో రోజూ చేసేయండి. మీరూ మీ ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉండొచ్చు.

ఇక ఈ జ్యూస్‌లో వాడే నిమ్మకాయ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. పైగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అనేక అనారోగ్య సమస్యలు దరి చేరకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. కీరాదోసలో నీరు ఎక్కువగా ఉండడంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియంలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా కీరా దోస బాగా పని చేస్తుంది. పుదీన, అల్లం ఘాటైన సువాసనతో మంచి రుచిని కలిగి ఉంటాయి. వీటన్నిటి మిశ్రమం శరీరానికి అమృతం వంటిది.

Tags

Read MoreRead Less
Next Story