అల్లరిమూకల పని అది: ప్రధాని మోదీ

కరోనా కట్టడికి కృషి చేస్తున్న మోదీకి గౌరవార్థంగా ఐదు నిమిషాల పాటు దేశ ప్రజలంతా నిల్చుని సంఘీభావాన్ని ప్రకటించాలని జరుగుతున్న ప్రచారాన్ని ప్రధాని మోదీ ఖండించారు. కొంత మంది అల్లరిమూకలు పనికట్టుకొని తనను వివాదాల్లోకి లాగేందుకు ప్రయతిస్తున్నారని.. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఈ ప్రచారం జరుగుతుందని ఆయన అన్నారు. నిజంగా తనను గౌరవించాలనుకుంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో.. ఒక పేద కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు.

Recommended For You