ముగిసిన కోదండరాముని బ్రహ్మోత్సవాలు

ముగిసిన కోదండరాముని బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా గురువారం ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో భక్తులకు అనుమతి నిరాకరించగా, అర్చకుల సమక్షంలో గురువారం నాడు ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు మాత్రమే పాల్గొన్నారు. ఇక శుక్రవారం ఉదయం ఘనంగా చక్రస్నానం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవమూర్తులతోపాటు శ్రీ సుదర్శనచక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఈవో లోకనాథం, ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story