యూకేలోని ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్ లో కుంపటి పెట్టిన కరోనా

యూకేలోని ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్ లో కుంపటి పెట్టిన కరోనా

కరోనా మహమ్మారి.. ఇంగ్లాండ్ పార్లమెంట్ లో కుంపటి పెట్టింది. కరోనాను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేతపై జరుగుతున్న చర్చల్లో యూకేలోని ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్ లో భిన్నాభిప్రాయాలు తలెత్తినట్టు సమాచారం. కొందరు మంత్రులు మరో ఆరు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు దీనికి అభ్యంతరం చెబుతున్నట్టు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. సోమవారంతో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్ మంత్రులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఇప్పటికే ఈ గడువును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. కొందరు మంత్రులు ఆర్ధిక వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ఆంక్షలను మరికొంత కాలం కొనసాగిస్తే... భవిష్యత్తులో యూకే పరిస్థితి దయనీయంగా తయారవుతుందని వారు వాదిస్తున్నట్టు సమాచారం.

కాగా ఇటీవల కరోనా బారిన పడిన బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story