ఇకపై గోవా వెళ్లడం అంత ఈజీ కాదు..

ఇకపై గోవా వెళ్లడం అంత ఈజీ కాదు..

ఇంతకు ముందంటే పొలో మని ఫ్లైట్ ఎక్కేసి ఛలోమంటూ గోవా వెళ్లి పోయారు. బీచ్ అందాలను తిలకిస్తూ, సముద్ర అలలను ఆస్వాదిస్తూ మైమరచి పోయేవారు. మరి కరోనా వచ్చి అందరినీ కట్టడి చేసింది. ఇకపై గోవా వెళ్లాలంటే ఎవరైనా సరే హెల్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. నేను ఫిట్‌గా ఉన్నాను అన్న సర్టిఫికెట్ చూపిస్తేనే గోవాలోకి ఎంట్రీ.. లేదంటే గో బ్యాక్ అటోంది గోవా గవర్నమెంట్. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొన్ని సొంత నియమాలు అనుసరించే అధికారం ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి కోవిడ్-19 సర్టిఫికెట్ ఉంటేనే విమాన ప్రయాణీకులను అనుమతించాలని ఆయన అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించమంటూ తాను ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కోరినట్లు మంత్రి రాణే స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు జీరోకు చేరినా ఈ వైరస్‌ను అంత తక్కువగా అంచనా వేయకూడదని అధికారులంతా అప్రమత్తతోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరి చేస్తామని రాణే చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story