అమెరికా అలా చేయడం సమంజసం కాదు: రష్యా

అమెరికా అలా చేయడం సమంజసం కాదు: రష్యా

అమెరికా తీసుకున్న నిర్ణయం అత్యంత స్వార్ధపూరితమైందని రష్యా మండిపడింది. కరోనాపై పోరు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చే నిధులను అగ్రరాజ్యం అమెరికా నిలిపివేయడాని రష్యా తప్పుపట్టింది. డబ్ల్యూహెచ్‌వోకు కొత్తగా ఎటువంటి నిధులు పంపేది లేదని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని రష్యా తప్పుబట్టింది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు దృష్ట్య ప్రపంచం మొత్తం డబ్ల్యూహెచ్‌వోవైపే చూస్తోందని, ఇలాంటి సమయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ సంస్థను దెబ్బతీస్తుందని విమర్శించింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం.. అత్యంత స్వార్ధపూరితమైందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయ్ ర్యాబ్‌కోవ్ మండిపడ్డారు. అమెరికా నిర్ణయాన్ని యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ కూడా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా, ఇంతకాలం డబ్ల్యూహెచ్‌వోకు సమకూరే నిధుల్లో సింహభాగం అమెరికా నుంచే అందేవి.

Tags

Read MoreRead Less
Next Story