కరోనా కట్టడిలో లాక్‌డౌన్‌ కొంతవరకూ మాత్రమే పనిచేస్తుంది: చంద్రబాబు

కరోనా కట్టడిలో లాక్‌డౌన్‌ కొంతవరకూ మాత్రమే పనిచేస్తుంది: చంద్రబాబు

కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే లాక్‌డౌన్‌ కొంతవరకూ మాత్రమే పనిచేస్తుందని.. పూర్తీ స్థాయిలో ఫలితం రావాలంటే రాష్ట్రంలో పరీక్షలు పెద్దఎత్తున చేసి.. వైరస్‌ సోకిన వారిని వేరు చేసి చికిత్స అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా కేసులను దాచిపెట్టడం మంచిది కాదని ఆయన స్పష్టంచేశారు. దాస్తే అవి కరోనా మరింత విజృంభిస్తుందని హెచ్చరించారు. జిల్లా, మండల స్ధాయి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలు కరోనా పరీక్షలపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

రాబోయే రోజుల్లో దేశంలో కేసులు అరవై వేలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని గుర్తు చేసారు. కరోనాపై పోరాటంలో కేరళ మంచి ఫలితాలు సాదిస్తుందని చంద్రబాబు అన్నారు. అటు ప్రధాని మోడీ కూడా.. వైరస్ పై పోరాటంలో అందరిని సమన్వయం చేశారని.. అందువల్లే లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతోందని అన్నారు. కరోనాను పూర్తిగా నియంత్రించాలంటే పరీక్షలు పెద్దఎత్తున జరగాలని.. తద్వారా వైరస్‌ సోకిన వారిని వేరు చేసి చికిత్స చేస్తేనే పూర్తి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story