పాటిస్తే జూన్ వరకు లేదంటే ఏడాది చివరి వరకూ..

పాటిస్తే జూన్ వరకు లేదంటే ఏడాది చివరి వరకూ..

కోవిడ్ నుంచి కోలుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలు విధిగా పాటించాలి. అప్పుడే జూన్ నెల చివరి నాటికి వైరస్ నుంచి బయటపడతాం. లేదంటే ఏడాది చివరి వరకూ వైరస్‌తో పోరాటం తప్పదని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కునేందుకు అవసరమైన యాంటీబాడీల అభివృద్ధిపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ పని చేస్తుందా అంటే శాస్త్రీయమైన ఆధారాలు లేవని, అయితే విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ముందు జాగ్రత్త చర్యగా ఈ మందును ఇస్తున్నారని చెప్పారు. భారత్‌లో వైరస్ బలహీనంగా ఉందనే విషయం చెప్పలేమన్నారు. ప్రస్తుతం ఇలా ఉన్నా ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని అంటున్నారు. దేశంలో లాక్‌డౌన్ కొనసాగిస్తూనే విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. లక్షణాలు లేకుండానే వ్యాధి వ్యాప్తి చెందుతుందన్న సంఘటనలు వెలుగు చూస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story