వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయటం లేదు: రైల్వేశాఖ

వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయటం లేదు: రైల్వేశాఖ

వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయటం లేదని రైల్వేశాఖ వెల్లడించింది. వలస కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్నా కథనాలపై ఈ మేరకు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రైల్వేశాఖకు డబ్బులు చెల్లిస్తున్నాయని తెలిపారు. ఇంకా అదనంగా ప్రయాణికులకు భోజన సదుపాయం కూడా రైల్వే శాఖ కల్పిస్తుందని తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన వారినే తరలిస్తున్నామని.. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేనివారిని శ్రామిక్ రైలులో అనుమతి ఇవ్వటం లేదని స్పష్టం చేసింది. వలస కార్మికులను తరలించడానికి రైల్వే శాఖ 34 రైళ్లు నడిపిస్తుంది. కాగా, వలస కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారని.. ఆ చార్జీలు కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని సోనియా గాంధీ ప్రకటించారు. అటు, బీజీపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామీ కూడా వలస కార్మికుల నుంచి చార్జీలు వసూలు చేయడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story