ఈ రోజు ఇలా మొదలైందేంటి: టాలీవుడ్ ప్రముఖులు

ఈ రోజు ఇలా మొదలైందేంటి: టాలీవుడ్ ప్రముఖులు

విశాఖలో విష వాయువు లీకేజీ దుర్ఘటన టాలీవుడ్‌ను షాక్‌కి గురి చేసింది. బాధితుల పరిస్థితిపై సినీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. విశాఖ వాసులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

అందమైన విశాఖ నగరంలో విషాదం నెలకొనడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదం నన్ను తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలి- అల్లు అర్జున్

అత్యంత బాధాకరం. రోజు రోజుకు పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. అందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా- నాని

వైజాగ్ గ్యాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి- ఎన్టీఆర్

వైజాగ్ ప్రజల కోసం ప్రార్థిస్తున్నా.. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలి - రామ్ చరణ్

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలి - వెంకటేష్

ఓ మైగాడ్ ఈ ప్రపంచానికి ఏమి జరుగుతోంది. వైజాగ్ వార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. వారు త్వరగా కోలుకోవాలి- దేవి శ్రీ ప్రసాద్

వైజాగ్ విషాదం అత్యంత బాధాకరం. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలి - రాజమౌళి

వైజాగ్ గ్యాస్ లీకేజీ వార్త మనసుని బాధించింది. వారంతా త్వరగా కోలుకోవాలి- మహేష్ బాబు

విశాఖలో విష వాయువుల బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధించింది. వారంతా త్వరగా కోలుకోవాలి. లాక్డౌన్ అనంతరం పరిశ్రమలు తిరిగి ప్రారంభించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా రకుల్ ప్రీత్, తమన్నా, లావణ్య త్రిపాఠి, ప్రగ్యాజైస్వాల్, నిఖిల్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, మంచు మనోజ్, బాబీ తదితరులందరూ వైజాగ్ ఘటనకు వెంటనే స్పందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడాన్ని ప్రశంసిస్తున్నారు. వైజాగ్ వాసులు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story