కోటిస్తాం.. చావడానికి మీరు సిద్ధమా?.. వైసీపీ నేతలకు లోకేష్ ప్రశ్న

కోటిస్తాం.. చావడానికి మీరు సిద్ధమా?.. వైసీపీ నేతలకు లోకేష్ ప్రశ్న

ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై TDP ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్యాస్ లీకేజీ నష్ట తీవ్రతను జగన్ దాచే ప్రయత్నం చేయడం తగదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విష వాయువుల విడుదల వల్ల జరిగే అనర్థాలకు వాస్తవాలే సాక్ష్యాలంటూ ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు చంద్రబాబు. స్థానికుల ఆరోగ్యంపై విష వాయువులు చూపే ప్రభావం సహించలేనిదంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

మరోవైపు ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే అదే కోటి మీకిస్తాం... చావడానికి సిద్ధమా? అని ముఖ్యమంత్రి జగన్‌ను, మంత్రులను విశాఖ వాసులు, ఎల్జీ పాలిమర్స్ బాధితులు ప్రశ్నిస్తున్నారని లోకేష్ అన్నారు. విష వాయువులతో ప్రాణాలు తీస్తున్న కంపెనీ మాకొద్దని ప్రజలు రోడ్డెక్కితే వారిని అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు.

ప్రజల చావుకు కారణమైన కంపెనీ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేసి మాట్లాడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. పైగా అదో గొప్ప కంపెనీ అని కితాబు ఇచ్చారని.. కానీ ప్రశ్నించిన ప్రజలను మాత్రం అణిచివేస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. పైగా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారంటూ మంత్రులు మదంతో మాట్లాడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వేసిన ఓట్లతోనే మీరు పెత్తనం చేస్తున్నారనే విషయం మరిచిపోయి ప్రజలను అవమానించడం దారుణమన్నారు. వెంటనే దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని కంపెనీని అక్కడి నుంచి తరలించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story