నన్ను కాపాడండి.. చెన్నైలో కరోనాతో బాధపడుతున్న ఆంధ్రా వ్యక్తి ఆవేదన

నన్ను కాపాడండి.. చెన్నైలో కరోనాతో బాధపడుతున్న ఆంధ్రా వ్యక్తి ఆవేదన

చెన్నైలోకరోనాతో బాధపడుతున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తనను రక్షించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఈ మేరకు సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు. పెంటపాడుకు చెందిన ఇతను.. చెన్నై కోయంబేడ్‌ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 5న కరోనా లక్షణాలతో చైన్నై జీహెచ్‌ ఆసుపత్రిలో చేరాడు. మూడ్రోజుల తర్వాత అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ కేవలం రెండ్రోజులు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు.. ఈ నెల 10న డిశ్చార్జి ‌చేశారు. కరోనా నుంచి కోలుకోకుండానే.. తనను డిశ్చార్జి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు.

ప్రస్తుతం తాను చైన్నైలోని ఓ రూంలోనే ఉన్నానని.. తనతోపాటు ఎంతో మంది ఇలాగే పాజిటివ్‌ బాధితులను ఆసుపత్రి నుంచి పంపేసినట్లు చెబుతున్నాడు. తనకు ప్రస్తుతం జ్వరం, దగ్గు తగ్గిపోయిందని, అయితే.. వాసన కోల్పవడం వంటి లక్షణాలతో తీవ్ర అనారోగ్యంతో ఒంటరిగా బాధపడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. తినడానికి కూడా ఏమీ లేవని, చెన్నైలో వైద్యం అందించాలని కోరుతున్నాడు. అక్కడ వీలుకాకపోతే.. కనీసం ఏపీకైనా తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story