ఇది నాకెంతో విలువైన బహుమతి: శేఖర్ కమ్ముల

ఇది నాకెంతో విలువైన బహుమతి: శేఖర్ కమ్ముల

నాకోసం మీరిలా.. మీరు చేస్తున్నదాని ముందు నేను చేస్తుంది చాలా తక్కువ అని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి అన్నారు. కరోనా మహమ్మారి వేళ్లూనుకుపోతున్నాజాగ్రత్తలు పాటిస్తూ వైరస్‌ను ఊడ్చేసే ప్రయత్నం చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ కార్మికులు. అంత మాత్రానికే ఇలా ధన్యవాదాలు తెలపడం.. నన్ను కదిలించింది. ఇది నాకు అతి పెద్ద బహుమతి అని టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నెలరోజులపాటు గాంధీ ఆస్పత్రి పరిధిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకోసం శీతల పానీయాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.

దాదాపు 1000 మందికి మజ్జిగ, బాదం మిల్క్ అందిస్తున్నారు. ఇక్కడే కాకుండా కర్నూల్ టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా శీతల పానీయాలను అందిస్తున్నారు. అందుకు కృతజ్ఞతగా గాంధీ హాస్పిటల్ వద్ద పని చేసే కార్మికులు ప్లకార్డులు పట్టుకుని శేఖర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ విషయం నన్నెంతగానో కదిలించిందని, కార్మికులు నా కోసం ఇలా చేయడం వెలకట్టలేనిదని అన్నారు. ఇది నాకు వచ్చిన అతి పెద్ద బహుమతి. నేను చేసిన ఓ చిన్న పని మిమ్మల్ని ఇంతగా కదిలించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా కోసం మీరు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. దాంతో పోల్చుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు అని ట్విట్టర్‌లో వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story