వరుడిని వెతుకుతున్నాం.. వచ్చే ఏడాది పెళ్లి: నాగబాబు

వరుడిని వెతుకుతున్నాం.. వచ్చే ఏడాది పెళ్లి: నాగబాబు

వచ్చే ఏడాదిలో తన కుమార్తె నిహారికకు వివాహం చేయాలనే ఆలోచనలో ఉన్నామని నటుడు నాగబాబు తెలిపారు. నీహారికకు సంబంధాలు చూస్తున్నామని వచ్చే ఏడాది మొదట్లోనే ఆమెకు వివాహం చేస్తామని ఆయన అన్నారు. నిహారికకు చేసిన వెంటనే వరుణ్‌తేజ్‌కి కూడా పెళ్లి చేస్తామని ఆయన అన్నారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.

పిల్లలిద్దరి పెళ్లిళ్లు అయితే నేను ఫ్రీ అవుతాను. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నీహారికకు పెళ్లి చేయాలని చూస్తున్నాం అని నాగబాబు తెలిపారు. ఇక వరుణ్ తేజ్‌ను ఐపీఎస్‌గా, నిహారికను డాక్టర్‌గా చూడాలని తనకు ఉండేదన్నారు. కానీ ఇద్దరూ సినిమాల్లోకి వస్తానంటే కాదనలేక పోయాను. అలాగే నిహా వెబ్ సిరీస్ చేస్తానంటే కూడా అబ్జెక్ట్ చేయలేదన్నారు. తన ఇష్టాన్ని పిల్లలపై రుద్దలేక వాళ్లకి ఇష్టమైన మార్గంలోకి వెళ్లడానికే సపోర్ట్ చేశానన్నారు.

Tags

Read MoreRead Less
Next Story