ఎంత ధైర్యం.. కోబ్రాకి స్నానం.. వీడియో వైరల్

ఎంత ధైర్యం.. కోబ్రాకి స్నానం.. వీడియో వైరల్

మంచీ చెడు మనుషులకే తెలియట్లేదు.. ఇంక కోరల్లో విషం దాచుకున్న పాములకు ఏం తెలుస్తుంది. అయినా ఎండ వేడికి తట్టుకోలేకపోతుంటే చల్లగా నెత్తిమీద నీళ్లు పోస్తున్న వ్యక్తిని ఎందుకు కాటేయాలనుకుందో ఏమో.. ఎంచక్కా పోయించుకుంటోంది. అతడు కూడా ఏ మాత్రం భయపడకుండా పాముకి నీళ్లు పోస్తున్నారు. భారతీయ అటవీ సేవల అధికారి సుశాంత్ నందా ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పాములను నిర్వహించడంలో శిక్షణ పొందిన వ్యక్తి కోబ్రాకి నీళ్లు పోస్తున్నాడు.

వీడియో చూసే వారికి ఒళ్లు గగుర్పొడిచేదిగా ఉంది. అయితే ఎవరూ కూడా ఇలాంటి సాహసం చేయవద్దని నందా హెచ్చరించారు. పాము ఎప్పుడైనా ప్రమాదకరమే. దయచేసి ప్రయత్నించవద్దు అని రాశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 73 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. భూమి మీద అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి కోబ్రా. సంరక్షకుడి ధైర్యాన్ని, భయం లేకపోవడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. కింగ్ కోబ్రా భూమిపై పొడవైన విషపూరిత పాము జాతులు. కోబ్రా ఒకే కాటులో అందించే న్యూరోటాక్సిన్ మొత్తం 20 మందిని చంపడానికి సరిపోతుంది.

Tags

Read MoreRead Less
Next Story