తూర్పు మన్యంలోకి వ్యాపించిన కరోనా.. నాలుగు నెలల బాలుడికి సోకిన వైరస్

తూర్పు మన్యంలోకి వ్యాపించిన కరోనా.. నాలుగు నెలల బాలుడికి సోకిన వైరస్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌....ఇప్పటి వరకు తూర్పు మన్యం దరిచేరలేదు. కానీ ఇప్పుడు రంపచోడవరం మండలం, బోలగొండ పంచాయితీ చెరువూరు గ్రామానికి కరోనా వ్యాపించింది. ఈ ఊళ్లో 4 నెలల బాలుడికి కరోనా సోకింది. కాకినాడ డాక్టర్లు దీన్ని నిర్ధారణ చేయడంతో.. గిరిజనులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో.. ఐటీడీఏ అధికారులు అప్రమత్తమై.. చెరువూరుతో పాటు సమీప గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన శానిటైజేషన్‌ చేయించారు. ప్రస్తుతం రెడ్‌ జోన్‌గా ప్రకటించి రాకపోకలు బంద్‌ చేశారు అధికారులు. ఈ కుటుంబంతో కాంటాక్ట్‌ అయిన వారందరికి కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు.

ఈ నెల 14న జ్వరం రావడంతో.. బాబును వాడపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయినా అక్కడ నయం కాకపోవడంతో.. మరుసటి రోజే.. రంపచోడవరం తరలించారు. అక్కడ్నుంచి కాకినాడకు తరలించి కరోనా పరీక్షలు చేశారు. చివరికి ఆ బాలుడికి కరోనా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. చెరువూరుతో పాటు సమీప గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు.

Tags

Read MoreRead Less
Next Story