హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. అధికారుల అంచనాలు తలకిందులు

హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. అధికారుల అంచనాలు తలకిందులు

హైదరాబాద్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. లాక్‌డౌన్ సడలింపు తర్వాత మరింత దీని తీవ్రత ఎక్కువైంది. గత కొద్దిరోజులుగా నమోదవుతున్న కేసులు సంఖ్య చూస్తే అర్ధమవుతోంది. వైరస్ గ్రేటర్‌లో చాపకింద నీరులా విస్తరిస్తూ నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. సాధారణ ప్రజలతోపాటు ఓ వైద్యుడికి, ముగ్గురు కానిస్టేబుళ్లకు వైరస్ సోకడం సంచలనంగా మారింది. కొద్దిరోజుల వరకు హైదరాబాద్ లో రెండువందలకు పైగా కట్టడి కేంద్రాలు ఏర్పాటుచేశారు. అవికాస్తా చాలా వరకు తగ్గిపోయాయి. అంటే కేసులు సంఖ్య తగ్గిందని అనుకోలేము. బాధితులను ఇళ్లు, అపార్ట్ మెంట్‌కే పరిమితం చేస్తున్నారు అధికారులు. దీంతో కట్టడి కేంద్రాలు తగ్గిపోయాయి. ఒకవైపు కరోనా పెరుగడం.. మరోవైపు లాక్ డౌన్ సడలంపులు ఇవ్వడంతో జనం ఆందోళన చెందుతున్నారు.

గత నెల కంటే ఈ నెలలో నమోదైన కేసుల సంఖ్య రెట్టింపుగా ఉన్నాయి. గత 25 రోజుల్లో 674 మందికి వైరస్‌ సోకింది. ఈ కేసులన్నీ ఎక్కువగా కొన్ని కుటుంబాల సభ్యుల మధ్యే ఉన్నాయి. అయితే మర్కజ్‌ లింక్‌లన్నీ ఈనెల మొదటి వారంతో పూర్తవుతాయని అధికారులు భావించారు. కానీ మే 7వ తేదీ వరకు కరోనా పాజిటివ్‌ సంఖ్య జీరోకు చేరుకుంటుందని యంత్రాంగం అంచనా వేశారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ నగరంలో కరోనా విస్తరిస్తోంది.

కరోనా వైరస్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దాని ప్రభావం అధికంగా ఉంది. కాచిగూడకు చెందిన ఓ వృద్దుడికి కరోనా సోకగా అతని కుటుంబంలో మరో ఇద్దరికి వైరస్ సోకింది. బోరబండలో ఓ మటన్ షాపు నిర్వాహకుడితపాటు అతని తల్లికి కనోనా సోకడంతో వాళ్లను ఆస్పత్రికి తరలించారు. వారి కుటంబంలోని ఏడుగురు కుటుంబ సభ్యులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్లో .. ఒక వ్యక్తిని కరోనా పాజిటివ్ రాగా ... అతడి కుటుంబంలోని 12మందిని హోం క్వారంటైన్ కు తరలించారు. ముషీరాబాద్‌లో ఇద్దరికి, మియాపూర్ లో ఇద్దరు దంపతులకు పాజిటివ్ వచ్చింది. ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story