లాక్‌డౌన్ 5.0.. 4 రాష్ట్రాలు 11 నగరాలు!!

లాక్‌డౌన్ 5.0.. 4 రాష్ట్రాలు 11 నగరాలు!!

లాక్డౌన్ 4.0 ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ 5పై చర్చ జరుగుతోంది. దేశంలో కరోనా కేసులు లక్షన్నర దాటడంతో లాక్డౌన్ కొనసాగించాల్సిందేనని కొన్ని చోట్ల వినిపిస్తోంది. అయితే కరోనా తీవ్రంగా ఉన్న నగరాల్లోనే లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దీంతో లాక్డౌన్ 5పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ముంబై, పూణె, జైపూర్, సూరత్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, థానే, ఇండోర్, బెంగళూరు సహా మొత్తం 11 నగరాల్లో లాక్డౌన్ కొనసాగనుంది. ఈ నెలాఖరున ప్రసారమయ్యే మనకీ బాత్‌లో లాక్డౌన్-5పై ప్రధాని ప్రకటన చేస్తారని అధికారులు భావిస్తున్నారు. అయితే లాక్డౌన్-5లో మరికొన్ని సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. విద్యాసంస్థలు, సినిమాహాళ్లు మూసివేసినా దేవాలయాలు, జిమ్‌లు తెరుస్తారని సమాచారం. అయితే కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story