దేశంలో మండిపోతున్న ఎండలు.. 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

దేశంలో మండిపోతున్న ఎండలు.. 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయే సామెతను నిజయం చేస్తూ.. భానుడు సెగలు కక్కుతున్నాడు. ఉదయం తొమ్మిది దాటిందంటే.. జనం కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటి పరుగులు పెడుతున్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాలో వేడి కుంపట్లు రగులుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.

మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 15 హాట్‌స్పాట్‌లలో 10 మనదేశంలోనే వుండటం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన 5 హాట్‌స్పాట్లు కూడా పక్కనున్న పాకిస్తాన్‌లోనే వున్నాయని.. ఎల్‌ డొరాడో వాతావరణ శాఖ వెబ్‌సైట్ వెల్లడించింది.

ముఖ్యంగా రాజస్థాన్‌లో వేడి సెగలు రగులుతున్నాయి. రాష్ట్రంలోని చురు నగరంలో మంగళవారం 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. థార్‌ ఎడారి ముఖద్వారమైన చురుతో పాటు పాక్‌లోని జాకోబా బాద్‌లలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌కే చెందిన బికనీర్, గంగానగర్, పిలానీలతో పాటు.. యూపీ, మహారాష్ట్ర, హర్యానాలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story