సోషల్ మీడియాను బంద్ చేస్తానంటూ.. ట్రంప్ చిందులు

సోషల్ మీడియాను బంద్ చేస్తానంటూ.. ట్రంప్ చిందులు

అమెరికా అద్యక్షడు ట్రంప్ సోషల్ మీడియాపై చిందులు వేస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలను బంద్ చేస్తానని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చేసిన ట్విట్ లపై.. ట్విట్టర్ ప్యాక్ చెక్ ద్వారా షాకిచ్చింది. దీంతో ట్రంప్ ఈ మేరకు మండిపడుతున్నారు. కరోనా నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోస్టల్ ఓటింగ్ అమలుపై కాలిఫోర్నియా ప్రయత్నిస్తుంది. అయితే, ట్రంప్ దీనిపై ట్వీటర్ వేదికగా స్పందిస్తూ.. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా.. ఎన్నికలు జరిగితే.. రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని అన్నారు. దీంతో ట్రంప్ ట్వీట్లపై.. ట్వీటర్.. ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఈ ట్వీట్లు సత్యదూరమైనవని.. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా రిగ్గింగ్ జరిగే అవకాశం లేదని తేల్చింది. అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ముద్ర వేసింది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తానంటూ ద్వజమెత్తారు. అమెరికా అద్యక్ష ఎన్నికల్లో సోషల్ మీడియా తలదూర్చుతోందని అన్నారు. ట్వీటర్ ఇలా చేయడమంటే.. వాక్ స్వతంత్ర్యాన్ని అడ్డుకోవడమేనని.. తమ గొంతు నొక్కేందుకు టెక్ కంపెనీలు ప్రత్నిస్తున్నాయని అన్నారు. అయితే, ఈ లోపే వాటిని బంద్ చేసే విధంగా చట్టాలు తీసుకొని వచ్చే ఆలోచనలో ఉన్నామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story