మిడతలతో విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది: డీజీసీఏ

మిడతలతో విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది: డీజీసీఏ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో మిడతల దాడి తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. రైతుల పంటలను ఇవి పూర్తిగా నాశనం చేస్తున్నాయి. అయితే, ఈ మిడతల సెగ ఇప్పుడు విమానాలకు కూడా తాకింది. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అవుతున్న సమయంలో వీటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం పైలట్లు, ఇంజినీర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి సాదారణంగా తక్కువ ఎత్తులో ఎగురుతాయి.. కనుక, ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో జాగ్రత్తలు వహించాలని.. ఇవి ఇంజన్ లోని, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని డీజీసీఏ పేర్కొంది. పాకిస్తాన్ నుంచి భారత్ లోని గుజరాత్, పంజాబ్ లోకి వచ్చిన ఈ మిదతలు.. ఇప్పుడు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్ లను కూడా చేరాయి.

Tags

Read MoreRead Less
Next Story