జీ7 సమావేశాలపై ట్రంప్ కీలక ప్రకటన

జీ7 సమావేశాలపై ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షడు ట్రంప్ జీ7 దేశాల సమావేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ లో జరగాల్సిన జీ7 సమావేశాలను వాయిదా వేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతే.. కాదు ప్రస్తుతం జీ7లో ఉన్న సభ్యదేశాలు ప్రపంచానికి పూర్తగా ప్రాతినిథ్యం వహింస్తున్నాయని తాను భావించడంలేదని.. ఈ సభ్య దేశాలు అన్నీ కాలం చెల్లిన దేశాలని అన్నారు. సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల ముందుగానీ.. తరువాత కానీ.. జీ7 సమావేశాలు ఏర్పాటు చేస్తానని.. అయితే.. ఈ సమావేశాలకు సభ్యత్వం లేని భారత్, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలకు ఆహ్వానం పంపిస్తామని అన్నారు. ప్రస్తుతం జీ7 గ్రూప్ లో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలు సభ్య దేశాలుగా ఉంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story