జింకను చుట్టేసిన కొండచిలువ.. క్షణాల్లో ప్రాణం..

జింకను చుట్టేసిన కొండచిలువ.. క్షణాల్లో ప్రాణం..

ఒక జంతువు బతకాలంటే మరో జంతువును తినక తప్పదు. సృష్టిలో అది భాగమే అయినా ప్రత్యక్షంగా చూడాలంటే బాధగా ఉంటుంది. అమాయకపు ప్రాణిని రక్షించాలని మనసు ఆరాట పడుతుంది. అదే చేశాడు ఓ వ్యక్తి అడవిలోని ఓ కొండ చిలువ దారిన పోయే జింకని చుట్టేసింది. జింక ప్రాణాలు కోల్పోతే కొండచిలువ గుటకాయస్వాయా చేద్దామనుకుంది. కానీ ఇంత లోపు ఓ వ్యక్తి పొడవైన చెట్టు కొమ్మని తీసుకుని కొండచిలువను అదిలించాడు జింకను విడిచి పెట్టాలని. కానీ అతడి మీదకి కూడా వెళ్దామనుకుంది. అంతలోనే ఏమైందో జింకను విడిచి తన దారిన తాను వెళ్లి పోయింది. ఈ వీడియోని శుక్రవారం థాయ్‌లాండ్ అడవిలో చిత్రీకరించారు. 24 సెకన్ల ఈ వీడియోను జూ అసిస్టెంట్ డైరెక్టర్ డుసిత్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోని ఇప్పటికే 9.4 లక్షల మంది చూశారు. 17వేల లైకులు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story