అంతర్ రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి: గౌతమ్ సవాంగ్

అంతర్ రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి: గౌతమ్ సవాంగ్

సొంత ప్రాంతాలకు వెళ్లాలని భావించే ఏపీ ప్రజలు సరిహద్దుల్లో పడుతున్న కష్టాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సరిహద్దుల్లో ఉన్నవారి కష్టాలు చూసి బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల రాకపోకల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. పోలీస్ శాఖ ఏడాది పాలనపై గౌతమ్ సవాంగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

గత రెండు వారాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో బాగా పనిచేసిందని ఆయన ప్రశంసించారు. మద్యం అక్రమ రవాణాలో 6 వేల 196 కేసులు నమోదు చేసి 8 వేల 141 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఇసుక అక్రమ రవాణాలో 703 కేసులు నమోదు చేసి ఒక వేయి 351 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు గౌతమ్ సవాంగ్ చెప్పారు. సోషల్ మీడియాలో హద్దుమీరి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story