భారత్‌కు మాల్యా రాకపై నీలినీడలు

భారత్‌కు మాల్యా రాకపై నీలినీడలు

ఇదిగో మాల్యా.. అదిగో మాల్యా.. గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్న మాటలు ఇవే. ఆర్థిక నేరగాడు విజయమాల్యాను భారత్ కు తీసుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని అందరూ అనుకున్నారు. అయితే.. యూకే ప్రభుత్వం మాల్యాను భారత్ కు అప్పగించే విషయంలో ఊహించని ట్వీస్ట్ ఇచ్చింది. మాల్యా వ్యవహారంలో న్యాయ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని.. పెండింగ్ లో ఉన్న సమస్యను పూర్తి చేసేవరకూ మాల్యాను భారత్ కు పంపలేమని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. సుప్రీం కోర్టులో కూడా మాల్యాకు చుక్కెదురైన తరువాత ఇంకా మిగిలి ఉన్న ప్రక్రియ ఏంటీ అనేది అనుమానంగా ఉంది. అయితే.. పూర్తి కావలిసిన ప్రక్రియ ఉంది అని చెప్పిన బ్రిటిష్ ప్రభుత్వం.. అది ఏంటి అనేది రహస్యమని అంటుంది. ఆ ప్రక్రియ పూర్తికావడానికి ఎంత సమయం పడుతోందని తాము చెప్పలేమని.. వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తామని యూకే హైకమిషన్ ప్రతినిధి తెలిపారు. కాగా.. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం భారత బ్యాంకుల దగ్గర వేలకోట్లు రుణం తీసుకున్న మాల్యా వాటిని ఎగ్గొట్టి.. లండన్ కు పారిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో మాల్యాను భారత్ కు అప్పగించాలని భారత్ ధాఖలు చేసిన పిటిషన్ ను సవాల్ చేస్తూ.. మాల్యా లండన్ హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ ఆయన అభ్యర్థనను కొట్టివేయడంతో.. అక్కడి సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురవ్వడంతో.. మాల్యా భారత్ కు రావడానికి ముహూర్తం ఫిక్స్ అవుతోందని అందరూ అనుకున్నారు. కానీ, బ్రిటన్ ప్రభుత్వం మరోమెలిక పెట్టింది. వాస్తవానికి యూకేలో నేరస్తుల అప్పగింత చట్టం ప్రకారం.. సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పు వెలువరించిన 28 రోజుల్లో నేరస్తుడిని అప్పగించాలి. ఒకవేళ సదరు వ్యక్తి ఆ దేశంలో శరణార్థిగా ఉండేందుకు ఆశ్రయం కోరితే.. ఆ వ్యవహారం తేలేదాకా అప్పగింతకు అవకాశం ఉండదు. అయితే మాల్యా యూకే ఆశ్రయం కోరారా లేదా అన్నదానిపై స్పష్టత లేదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story