భయమేస్తుంది కానీ.. భలే ఉంది కదా శ్వేత కొండ చిలువ

భయమేస్తుంది కానీ.. భలే ఉంది కదా శ్వేత కొండ చిలువ

అచ్చంగా రబ్బరు పాములా ఉంది. పైథాన్ అందానికి మురిసిపోతూ ఎంత ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు పాములు పట్టే నిపుణుడు. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళ తాలూకా కావళకట్టె గ్రామంలో అరుదైన కొండచిలువ కనిపించింది. ఇంట్లోకి జర జరా పాకుతూ వచ్చిన తెల్లని పాముని చూసి తెల్గబోయారు ఇంటిల్లపాది. వెంటనే తేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు పాములు పట్టే కిరణ్ అనే వ్యక్తిని తీసుకుని వెళ్లారు. అతడు అత్యంత చాకచక్యంగా ఆ పైథాన్ని పట్టుకున్నాడు. అటవీ అధికారులు సిబ్బంది సాయంతో పైథాన్ ని పిలికుళ నిసర్గధామ అడవులకు తరలించారు. జన్యులోపం కారణంగా పాములు ఇలా తెల్లగా జన్మిస్తాయని అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుందని అన్నారు. ఇలాంటి పాములను ఎల్బినో అని అంటారని అన్నారు. ఆకర్షణియంగా కనిపిస్తున్నా అవి పాములు ఏమాత్రం వాటిని తక్కువగా అంచనా వేయకూడదు.

Tags

Read MoreRead Less
Next Story