జూలై15 నుంచి షూటింగ్‌లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

జూలై15 నుంచి షూటింగ్‌లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు.. మంగళవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మెగస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, రాజమౌళి, సి. కళ్యాణ్, సురేష్ బాబు, దిల్ రాజు, పొట్లూరి ప్రసాద్ తదితరులు సీఎంను కలిశారు. లాక్‌డౌన్‌తో నష్టపోయిన సినీరంగాన్ని ఆదుకోవాలని కోరారు. మళ్లీ షూటింగ్‌లకు పర్మిషన్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై తమ అభిప్రాయాలను వినిపించారు.

సీనీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలను టాలీవుడ్ ప్రతినిధులు జగన్‌కు వివరించారు. జూలై 15 తర్వాత ఏపీలో షూటింగ్‌లకు అనువైన విధానాన్ని రూపొందించి ఆర్డర్ పాస్ చేయాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్ల కరెంట్ బిల్లులకు సంబంధించి మినిమం డిమాండ్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. టాలీవుడ్ ప్రముఖుల విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. జూలై 15 నుంచి షూటింగ్‌లకు అనుమతులు మంజూరు చేశారు. కేంద్రం నుంచి అనుతులు రాగానే థియేటర్లకు కూడా పర్మిషన్ ఇస్తామని అన్నారు. అయితే, ఆన్‌లైన్‌లోనే టికెటింగ్ జరగాలని సూచించారు.

2019కి సంబంధించి నంది ఉత్సవాలు జరుపుతామని సీఎం హామీ ఇచ్చారు. చిన్న సినిమాలకు త్వరలోనే సబ్సడీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వైజాగ్‌లో సినీ పరిశ్రమ సెటిలైతే.. స్టూడియోలతో పాటు, ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు సీఎం జగన్. తెలుగు సినిమా పరిశ్రమకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా వుంటానని సినీ ప్రముఖులకు జగన్ హమీ ఇచ్చారు. ఇక, తక్షణమే కొన్ని అనుమతులు మంజూరు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వున్న సినిమాలు, లాక్‌డౌన్‌తో సగం సగంలో ఆగిపోయిన సీరియళ్ల షూటింగ్‌కు అనుమతులు మంజూరు చేశారు. అయితే, సినిమా హాళ్లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ మేరకు ఏపీ హోం శాఖ జీవో విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story