రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపుతో తీవ్రనష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు పేట్రేగిపోయాయని ఆరోపించారు. ప్రత్యర్థులపై ప్రతీకారమే వైసీపీ లక్ష్యమని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చడానికే విధ్వంసాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రలోభాలు, బెదిరింపులతో టీడీపీ నేతల్ని తమ పార్టీలోకి లాక్కున్నారని అన్నారు. వందల కోట్ల జరిమానాలతో నేతల్ని బెదిరించి లోబర్చుకున్నారని మండిపడ్డారు. టీడీపీ నుంచి ఎవరినైనా తీసుకుంటే రాజీనామా చేయిస్తామని గతంలో జగన్ చెప్పారని.. మరి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో రాజీనామా ఎందుకు చేయించలేదని నిలదీశారు చంద్రబాబు. ఏడాది పాలనలో 9మంది టీడీపీ కార్యకర్తలను, నాయకులను హత్య చేశారని ఆరోపించారు.

ఏడాదిగా రైతుల సమస్యలు పరిష్కరించలేక పోయారని అన్నారు చంద్రబాబు. పేదల కోసం టీడీపీ తెచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేశారని లేఖలో ప్రస్తావించారు. కరెంటు బిల్లులు, మద్యం, ఇసుక, సిమెంటు రేట్లు విపరీతంగా పెంచేశారని అన్నారు. ఏడాదిలోనే 70 మంది భవన నిర్మాణ కార్మికులు, 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. పెట్టుబడులు తరిమేయడంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. 87వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. కరోనా ఉపశమన చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు చంద్రబాబు. బాధ్యతగల ప్రతిపక్షంగా ఏడాది పాలనలో వైసీపీ లోటుపాట్లను ఎత్తిచూపామని.. తప్పులు చక్కదిద్దకోకుండాడా టీడీపీపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు

Tags

Read MoreRead Less
Next Story