అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం

అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం

అచ్చెన్నాయుడు అరెస్ట్ తనను కలచివేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అరెస్ట్ చేసిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే పద్దతి ఇదేనా అని ప్రశ్నించారు. సర్జరీ అయ్యిందని.. రాలేనని చెప్పినా కూడా బలవంతంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కనీసం కరోనా నియంత్రణ పద్దతులు కూడా పాటించకుండా గోడదూకి మరీ ఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయు అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమని అన్నారు చంద్రబాబు. విజిలెన్స్ నోటీస్‌లో ఎక్కడా ఆయన పేరులేదన్నారు. అరెస్ట్‌కు ముందు రోజే అధికార పార్టీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంపై వైసీపీ అరాచకానికి పరాకాష్ట అన్నారు బాబు. అచ్చెన్నాయుడును గతంలో తీవ్ర అవమానాలకు గురిచేశారని అన్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ సైతం అచ్చెన్నాయుడికి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ చేస్తున్న అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తున్నాడు కాబట్టే.. అచ్చెన్నాయుడు గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేయించారని అన్నారు చంద్రబాబు. నిన్నమొన్నటివరకు దళితులపై దాడులు చేశారని.. ఇప్పుడు బీసీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వైసీపీ రాష్ట్రంలో ఉన్మాద పాలన సాగిస్తోందని అన్నారు.

40 వేల కోట్ల అవినీతికి పాల్పడిన A1 ముద్దాయి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అచ్చెన్నాయుడు మచ్చలేని మనిషి అని.. మీలాగా దోచుకోలేదని అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఏ ప్రాజెక్టు కూడా పూర్తిచేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో సహజ వనరులన్నీ దోచుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story