'చోక్ హోల్డ్' విధానానికి స్వస్థి: ట్రంప్

చోక్ హోల్డ్ విధానానికి స్వస్థి: ట్రంప్

అమెరికాలో నిందితులపైనా, నిరసనకారులపైన పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించడానికి ప్రయోగించే పద్దతే చోక్ హోల్డ్. ఈ విధానంలో పోలీసులు దుండగుడిగా భావించిన ఆ వ్యక్తి మెడపై కాలు పెట్టి నేలకేసి నొక్కుతారు. దాంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోతారు. ఇదే పద్దతిని ఉపయోగించి ఆఫ్రో-అమెరికన్ కు చెందిన వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ ని చంపేశాడు అమెరికన్ పోలీస్. అయితే ఈ చోక్ హోల్డ్ విధానానికి స్వస్తి పలకాలని అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇలాంటి విధానాన్ని ఉపయోగించవద్దని సూచించారు. ప్లాయిడ్ మరణంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే అమెరికాలోని పలు ప్రముఖ నగరాల్లో దీనిపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story