మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఆర్మీకల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర

మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఆర్మీకల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర

ఆర్మీకల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చైనా దుర్చర్యకు ప్రాణాలుకోల్పోయిన అమర జవాన్ కు నివాళులర్పించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సంతోష్ బాబును కడసారిచూసేందుకు నగరవాసులు ఉదయం నుంచే బారులు తీరారు. అతనితో తమకున్న అనుబంధాన్ని తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమ యాత్రకు సంబంధించి ఆర్మీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సైనిక లాంచనాలతో ప్రత్యేక వాహనంలో సంతోష్ బాబు భౌతిక కాయాన్ని ఉంచి తరలించనున్నారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అంతిమయాత్రలో సంతోష్‌ బాబు కుటుంబీకులు, బంధువులు, ఆర్మీ, పోలీసు అధికారులు పాల్గొననున్నారు. కల్నల్ అంతిమయాత్రలో పాల్గొనేవారు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని అధికారులు తెలిపారు.

సంతోష్ బాబు చివరిసారిగా చూసేందుకు ఇప్పటికే ఆయన ఇంటివద్దకు బంధువులు,స్నేహితులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఉదయం నుంచే ఆయనకునివాళులర్పిస్తున్నారు. ఈ ఘటనతో సూర్యాపేట శోకసంద్రంలో మునిగింది. కల్నల్‌ సంతోష్‌ బాబును కడసారి చూసేందుకు భారీగా వస్తున్నవారికోసం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఆర్మీ, ప్రభుత్వ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల్లో ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ముందుగా ఆర్మీ అధికారుల లాంఛనాల మేరకు కల్నల్‌ సంతోష్‌ బాబుకు సైనికులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల మతాచారం ప్రకారం సాంప్రదాయాలకు అనుగుణంగా అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు. సూర్యాపేటకు సమీపంలో ఉన్న కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story