coronavirus : తెలుగు రాష్ట్రాల్లో మూడొందల మార్క్ దాటేసింది..

coronavirus : తెలుగు రాష్ట్రాల్లో మూడొందల మార్క్ దాటేసింది..

మొన్నటి వరకు వందకిపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా తెలుగు రాష్ట్రల్లో మూడొందల మార్క్ దాటేసింది. ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవగా.. తెలంగాణలో నిన్న ఒక్క రోజే 269 కరోనా పాజటివ్ కేసులు నమోదు అయ్యాయి. పెరుగుతున్న కేసులతో జనం హడలిపోతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా శాతం గ్రేటర్ పరిధిలోనే ఉంటున్నాయి. నిన్న ప్రకటించిన 269 మంది పాజిటివ్ కేసులలో 214 మంది గ్రేటర్ ప్రాంతానికి చెందిన వాళ్లే. జీహెచ్ంఎసీ పరిధిలో వైరస్ బాధితుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ పోతుండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా కారణంగా ఒకరు మృతిచెందారు.

నిన్న నమోదైన కరోనా కేసుల్లో రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్‌లో 10, కరీంనగర్‌లో 8, జనగామలో 5, ములుగులో 5 కేసులు నమోదయ్యాయి. అలాగే మెదక్‌లో 3, సంగారెడ్డిలో 3, వనపర్తిలో 2, మేడ్చల్ లో 2, జయశంకర్ భూపాలపల్లి, ఆసీఫాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్‌లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ 5,675 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా 151 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3071 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 2412 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇక రాష్ట్రంలో కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సను గాంధీకి మాత్రమే ఎందుకు పరిమితం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. మ్స్ వంటి ఆస్పత్రులను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించింది. పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయి? సిబ్బందికి ఎన్ని ఇచ్చారో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ్టిలోగా సమర్పించాలని గాంధీ, నిమ్స్, ఫీవర్, కింగ్ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇవాళ జరిగే విచారణకు గాంధీ సూపరిండెంట్ హజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

అటు ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 351 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 15,188 శాంపిల్స్‌ను పరీక్షించగా.. రాష్ట్రంలో 275 పాజిటివ్‌ మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 51 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 23 మందికి పాజిటివ్‌ అని తేలింది. కర్నూలులో ఒకరు, గుంటూరులో మరొకరు కరోనా కారణంగా మృతి చెందారు. కాగా ఏపీలో మొత్తం 7,071కి కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. 90 మంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story