చైనా మొబైల్ యాప్ లు బ్యాన్..!!

చైనా మొబైల్ యాప్ లు బ్యాన్..!!

చైనా మొబైల్ యాప్ లతో భారతదేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. సుమారు 50 చైనా మొబైల్ యాప్ లను బ్యాన్ చేయాలని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఈ యాప్ ల ద్వారా దేశ కీలక భద్రతకు సంబంధించిన డేటా బయటకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. టిక్ టాక్, హలో, యూసీ బ్రౌజర్ వంటి మొబైల్ యాప్ లు దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఇది నిజం కాదంటున్నాయి మొబైల్ యాప్ కంపెనీలు.

గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. నిరసనకారులు చైనాతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 4జి అప్ గ్రేడేషన్ లో చైనా టెలికాం సామాగ్రిని ఉపయోగించరాదంటూ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలకు టెలికాం శాఖ నోటీసులు జారీ చేసింది. మరోవైపు దేశంలో 5జి టెక్నాలజీ అమలు కోసం సాంకేతికపరంగా చైనాతో కలిసి పనిచేసే ఆలోచనను కూడా పునరాలోచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story