శుక్రవారం 2,477 మందికి కరోనా పరీక్షలు చేస్తే 1,978 మందికి నెగిటివ్‌

శుక్రవారం 2,477 మందికి కరోనా పరీక్షలు చేస్తే 1,978 మందికి నెగిటివ్‌

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 499 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 329 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 129 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,526కి చేరింది. మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య 198కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.శుక్రవారం మొత్తం 2,477 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,978 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50వేల 569 మంది పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. మరో 51 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,352కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,976 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

శుక్రవారం గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కేసులను గుర్తించారు. ఒక్కరోజులోనే ఆల్ టైం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 499 కరోనా కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6526కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2976గా ఉన్నాయి. గత 24 గంటల్లో 51 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3352కు చేరింది. మరో ముగ్గురు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 198కి చేరింది...

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 329 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 129, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 4, మంచిర్యాల, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో 4, మహబూబ్ నగర్‌లో 6, జనగామలో 7, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 2 చొప్పున, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, భూపాలపల్లి జిల్లాల్లో 2 కేసుల చొప్పున, జనగామ, వరంగల్ అర్బన్‌లో 3 కేసులు, నల్గొండలో 4, జగిత్యాల, వరంగల్ రూరల్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.చేరింది.

Tags

Read MoreRead Less
Next Story