దేశవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య

దేశవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య

దేశంలో కరోనా ఉధృతి విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 4 లక్షల 15 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో లక్ష 75 వేల మంది ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు. 2 లక్షల 25 వేల మందికి పైగా ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తర్వాత కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు.

దేశవ్యాప్తంగా మహమ్మారి బారిన పడి 13 వేల 400 మం దికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

భారత్‌లో పాజిటివ్‌ కేసుల నమోదులో రోజుకో కొత్త రికార్డ్ నమోదవుతోంది. గురువారం 12 వేల 881 కేసులు నమోదవగా, శుక్రవారానికి కొత్త కేసులు 13 వేల 586కి చేరాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 14 వేల 5 వందలకు పైగా కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్క రోజు వ్యవధిలో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. వరుసగా 9వ రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వారం రోజుల వ్యవధిలోనే 10 నుంచి 15 వేల కేసులకు పెరగడం కరోనా తీవ్రతను తెలుపుతోంది.

లక్షా 25 వేలకుపైగా పాజిటివ్ కేసులతో మహారాష్ట్రలో పరిస్థితి భయానకంగా ఉంది. ఇక్కడ కరోనా ధాటికి 6 వేల మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో దాదాపు 57 వేలమంది బాధితులున్నారు.దేశ రాజధాని ఢిల్లీలో 53 వేలకు పైగా కేసులున్నాయి. గుజరాత్‌లో పాజిటివ్ కేసులు 26 వేలు దాటాయి. యూపీ, రాజస్థాన్‌, వెస్ట్ బెంగాల్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొవిడ్‌ బారినపడి జూన్‌ 17న ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ పరిస్థితి కొంత మెరుగుపడింది. ఆయనకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 67 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story