సీఎం కేసీఆర్ సొంత గ్రామం దేశానికే ఆదర్శంగా ఉండాలి: హరీష్ రావు

సీఎం కేసీఆర్ సొంత గ్రామం దేశానికే ఆదర్శంగా ఉండాలి: హరీష్ రావు

సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడక దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు మంత్రి హరీష్ రావు. చింతమడక, దమ్ము చెరువు, అంకంపేట గ్రామ పునర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో మూడు నెలల్లో మూడు గ్రామాల ప్రజలకు సొంత ఇళ్లను అందిస్తామని హామి ఇచ్చారు. అలాగే మరో పది రోజుల్లో మూడు గ్రామాల చెరువులు నిండనున్నాయని గ్రామస్తులకు తెలిపారు. జిల్లాలో రిజర్వాయర్లు ఉక్కువ ఉన్నాయి కనుక ప్రతి గ్రామానికి సాగునీరు అందే అవకాశం ఉందని ఆయన వివరించారు. భూస్థలాలు కొనేందుకు ప్రభుత్వం సాయంగా 9 కోట్ల 87 వేలతో 133 మందికి చెక్కులను పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు మంత్రి. భూములు భవిష్యత్ తరాలకు భరోసా ఉంటాయని ఎవరూ అమ్ముకోవద్దన్నారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా చింతమడకలో 22 లక్షల రూపాయలతో నిర్మించనున్న రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామి మేరకు ఇప్పటివరకు 1270 మందికి సాయం అందించామన్నారు. చింతమడక, దమ్ముచెరువు, అంకంపేట గ్రామాల్లో ఇంకా ఇళ్లు తొలగించని వారు కూడా ఇళ్లు తొలగించి స్థలాలు ఇస్తే..వాళ్లకు కూడా ఇళ్లు కట్టిస్తామని హరీష్ రావు అన్నారు. కూలీల కొరత, కరోనా ప్రభావంతో పనుల్లో కొంత జాప్యం జరిగినా..ఇక త్వరతగతిన పనులు పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు మంత్రి.

Tags

Read MoreRead Less
Next Story