భారత్‌లో మరో భూభాగాన్ని తమదంటున్న నేపాల్

భారత్‌లో మరో భూభాగాన్ని తమదంటున్న నేపాల్

ఓపక్క పాక్, మరోపక్క చైనా.. భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే.. మధ్యలో నేపాల్ కూడా కయ్యాన్నికి కాలు దువ్వుతుంది. ఉత్తరాఖండ్‌లోని భూభాగాలైన లిపులేఖ్, కలాపానీ,లింపియధురా ప్రాంతాలను.. నేపాల్ తమ ప్రాంతాలుగా చూపిస్తూ.. మ్యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించినా.. వెనక్కు తగ్గకుండా.. ఆ మ్యాప్ కు నేపాల్ పార్లమెంట్ ఎగువసభ, దిగువసభ రెండూ ఆమోదం తెలిపాయి. ఇప్పుడు తాజాగా మరో వివాదానికి నేపాల్ ప్రభుత్వం తెరలేపింది. బీహార్ లో కొంత ప్రాంతాన్ని తమ భూభాగం అని అంటుంది. బీహార్ జల వనరుల శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంది. బీహర్ లోని చంపారన్ జిల్లా లాలా బేకీ నదిపై ఆనకట్ట పనులు చేపడుతున్న భారతీయులను నేపాల్ అధికారులు అడ్డుకున్నారు. నిజానికి అవి కొత్తగా చేస్తున్న పనులు కాదు.. గతంలో నిర్మితమైన ఆనకట్టపై మరమ్మత్తులు చేపడుతున్నారు. అయితే, నేపాల్ ఇలా అడ్డుకోవడంపై బీహార్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని బీహార్ అధికారులు.. కేంద్ర ప్రభుత్వానికి తెలయజేశారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story