అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు ఇప్పట్లో లేనట్టేనా?

అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు ఇప్పట్లో లేనట్టేనా?

ఏపీనుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి వెళదామనుకున్న ప్రయాణికులకు నిరాశే మిగిలింది. ఈవారం నుంచి ఆర్టీసీ సర్వీసులు మొదలవుతాయనుకుంటే అధికారులు షాక్ ఇచ్చారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై

నేడు (బుధవారం) జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల భేటీని వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అయితే ఆర్టీసీ సిబ్బందిలో కొందరికి కరోనా సోకడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మరోవైపు ఈ భేటీ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత అంతరాష్ట్ర బస్సు సర్వీస్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో బస్సు సర్వీసులు తిప్పాలని ఇరు రాష్ట్రాల అధికారులు ప్రాధమిక చర్చలు జరిపారు. అయితే తుది చర్చలు వాయిదా పడటం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story