ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. వారంలోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. ఇటీవల వైపీసీ ఏడాది పాలనపై రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పించారు. ఇసుక అక్రమ రవాణా, ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవకతవకలను బాహాటంగానే ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించడం కరెక్టు కాదన్నారు. తిరుమల శ్రీవారి భూముల అమ్మకం విషయంలోనూ అందరి కంటే ముందుగా ఆయనే స్పందించారు. ఇంగ్లిష్ మీడియం విషయంలో పార్లమెంట్‌లోనే సొంత పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు.

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ. తానెవరినీ టికెట్‌ అడగలేదని.. బతిమాలితేనే వైసీపీలోకి వచ్చాననిఅన్నారు. సింహమే సింగిల్‌గా వస్తుందని.. పందులే గుంపుగా వస్తాయంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పారు. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుపైనా ఘాటు విమర్శలు చేశారు రఘురామకృష్ణంరాజు. ప్రసాదు రాజుతో మాట్లాడిస్తున్నవారు ఎవరో తనకు తెలుసని అన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ రాజుకి త్వరలో మంత్రి పదవి వస్తుందని జోస్యం చెప్పారు. అటు ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి శ్రీరంగనాథరాజు తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన రఘురామకృష్ణం రాజు...వారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు...

ఇటీవలే తనకు ప్రాణహాని ఉందంటూ ఉందని లోక్‌సభ స్పీకర్‌కు, జిల్లా ఎస్పీలకు లేఖ రాశాలు ఎంపీ రఘురామకృష్ణంరాజు . తనను చంపుతామని కొందరు వ్యక్తులు బెరిరిస్తున్నారని వాపోయారు. కేంద్రబలగాలతో తనకు రక్షణ కల్పించాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా రఘురామకృష్ణం రాజును వైసీపీ దూరం పెడుతోంది..పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు..సీఎం జగన్‌తో భేటీకి సమయం అడిగినా ఇవ్వలేదని ఇటీవలే చెప్పారు రఘురామకృష్ణం రాజు...ఈ సమయంలో ఆయనకు పార్టీ షోకాజు నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.

Tags

Read MoreRead Less
Next Story