తమిళనాడులో కరోనా విశ్వరూపం.. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ?

తమిళనాడులో కరోనా విశ్వరూపం.. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ?

తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. అయితే, రానున్న కాలంలో మరింత విస్తరించే అవకాశం ఉందని తాజా సర్వేలు తెలుపుతున్నాయి. తమిళనాడులో ఇప్పటివరకూ 62 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, 42 వేల కేసులు చైన్నై లోనే నమోదవడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో చెన్నైలో 2.5 లక్షల ఇళ్లు ప్రభుత్వ పర్యవేక్షణ క్వారంటైన్లుగా ప్రభుత్వం మార్చింది. చైన్నైలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో సుమారు పది లక్షల మంది సొంతూర్లకు తరలిపోయారు. అయితే, దేశంలో ఇప్పటి వరకూ కరోనా దాటికి 794 మంది చనిపోయారు. అయితే, కరోనా విజృంభణ భవిష్యత్ లో మరింత భయంకరంగా ఉంటుందని.. ఎంజీఆర్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తేల్చింది. చెన్నైతో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో కూడా కేసులు అమాంతం పెరిగిపోతాయని తెలిపింది. అయితే మొత్తం కేసుల్లో 60 శాతం చెన్నైలోనే నమోదవుతాయని.. జూలై నాటికి సుమారు 2.7 లక్షల కేసులు నమోదవుతాయని ఈ సర్వేలో తేలింది. ఇక అక్టోబర్ నాటికి ఈ మహమ్మారి వ్యాప్తి తారా స్థాయికి చేరుతుందని అంచనా. తప్పని సరిగా మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించడం వలన కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఈ వర్సిటి తెలిపింది.

అయితే, రాష్ట్రంలో మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం చూస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఐదో దశలో ఉన్నాం. జూన్ 30తో మరిన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. కరోనా రోగులు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో సీఎం పళినస్వామి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జూలై 1 నుంచి కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. కరోనా కట్టడికి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా కానీ.. చైన్నై సహా.. మరిన్ని జిల్లాలకు కానీ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story