అక్టోబర్ లో వ్యాక్సిన్.. తుది దశకు చేరుకున్న ట్రయల్స్

అక్టోబర్ లో వ్యాక్సిన్.. తుది దశకు చేరుకున్న ట్రయల్స్

కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ వచ్చేస్తుంది. తుది దశ ట్రయల్స్ కు చేరుకుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్టా జెనెకా ఫార్మా కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ అక్టోబర్ లో తీసుకురావడానికి పరిశోధకులు విశేష కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ వ్యాక్సిన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి. అయితే తుది దశ ట్రయల్స్ కు చేరుకున్న తొలి వ్యాక్సిన్ ఇదే.

ట్రయల్స్ తుది దశలో భాగంగా యూకేలోని 10,260 మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందులో అన్ని వయసుల వారూ ఉన్నారు. క్లినికల్ స్టడీస్ లో పురోగతి కనిపించిందని.. పెద్దల్లో రోగనిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ ఎలా ప్రేరేపిస్తుందో తెలుసుకునేందుకు తదుపరి ప్రయోగాలు నిర్వహిస్తున్నామని వ్యాక్సిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ తెలిపారు. తుది దశ ప్రయోగాలు విజయవంతమైతే ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే మరో 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలోను, 129 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలోనూ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 22న ప్రకటించింది. అమెరికాకు చెందిన మరో ఫార్మా కంపెనీ మోడార్నా రూపొందించిన వ్యాక్సిన్ తో పాటు. చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్ కూడా వచ్చే నెలలో తుది దశకు చేరుకుంటున్నాయి. మన దేశానికి చెందిన ఫార్మా సీరమ్ కంపెనీ వ్యాక్సిన్ తయారీ కోసమని 100 కోట్ల మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story