రెండో రోజు ముగిసిన అచ్చెన్నాయుడి విచారణ

రెండో రోజు ముగిసిన అచ్చెన్నాయుడి విచారణ

ఈఎస్‌ఐ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో ఏసీబీ అధికారుల అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటలపాటు అధికారులు విచారణ జరిపారు. ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్‌, చిరంజీవి నేతృత్వంలో విచారణ జరిగింది. ఏసీబీ విచారణ ప్రారంభించటానికి ముందు అచ్చెన్నాయుడికి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపీ తర్వాత ప్రత్యేక వార్డుకు తరలించిన అధికారులు అక్కడే విచారణ చేశారు. విచారణ సమయంలో అచ్చెన్నాయుడితో పాటు ఆయన తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు.

టెలీహెల్త్‌ సర్వీసెస్‌ వ్యవహారంలో ఓ కంపెనీకి సిఫార్సు చేస్తూ సంతకం పెట్టారంటే ఆ కంపెనీకి టెండర్లు ఇవ్వాలని చెప్పటమే కదా అని అచ్చెన్నాయుడుని ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. అయితే కొనుగోళ్ల సమయానికి తాను మంత్రిగా లేనని, ఆ ఫైల్స్‌ తన వద్దకు రాలేదని సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో వాటి అమలు ఏలా ఉందో అధ్యయనం చేయాలని మాత్రమే సూచించినట్లు తెలిపారు అచ్చెన్నాయుడు. మినిట్స్‌పై మాత్రమే సంతకం పెట్టినట్లు తెలిపారు. ఇక అచ్చెన్నాయుడు భార్య నుంచి సంక్రమించిన ఆస్తుల గురించి అడిగారు అధికారులు. అచ్చెన్నాయుడిని శనివారం కూడా విచారించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story