కరోనాతో వీడియో జర్నలిస్ట్ మృతి..

కరోనాతో వీడియో జర్నలిస్ట్ మృతి..

కరోనా మహమ్మారి తమిళనాడులోని సీనియర్ వీడియో జర్నలిస్టును పొట్టన పెట్టుకుంది. 15 రోజుల క్రితం పాజిటివ్ అని తెలియడంతో వేల్ మురుగన్ (41) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం కన్నుమూశారు. దీంతో తోటి జర్నలిస్టులు విషాదంలో మునిగిపోయారు. ఆయన దగ్గర ట్రెయినింగ్ పొందిన మిత్రులు కెరీర్ కొత్తలో తమకెంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ జర్నలిస్ట్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. మీడియా జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్ 50 వేల రూపాయల సాయం ప్రకటించారు. మురుగన్ భార్య షణ్ముగ సుందరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గత 20 సంవత్సరాలుగా వివిధ టెలివిజన్ ఛానెళ్లలో పని చేసిన మురుగన్ కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. భార్య షణ్ముగ సుందరి ఆర్ జీజీజీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పని చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story