ఆ రాష్ట్రంలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా న‌మోదు కాలేదు

దేశంలో కరోనా విజృంభిస్తున్న‌ది. దేశవ్యాప్తంగా ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కొత్త‌కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోనూ క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంది. అయితే.. మిజోరంలో ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేదని.. రాష్ట్ర స‌మాచార, ప్ర‌జా సంబంధాల శాఖ వెల్ల‌డించింది.

కాగా, మిజోరంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 151కి చేరింది. అందులో 61 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 90 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే ప్రాణంతకర క‌రోనా మహమ్మారి కార‌ణంగా మిజోరంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు.

Recommended For You