కేంద్రం కీలక నిర్ణయం.. 59 చైనా యాప్స్ నిషేధం

కేంద్రం కీలక నిర్ణయం.. 59 చైనా యాప్స్ నిషేధం

కేంద్ర ప్రభుత్వం చైనా ముబైల్ యాప్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల వేళ 59 డ్రాగన్ యాప్ లను నిషేధించింది. టిక్ టాక్, యూసీ బ్రౌజర్, హెలో, షేర్ చాట్ లాంటి మొత్తం 59 యాప్‌లను బ్యాన్ చేసింది.

గాల్వాన్ లోయలో భారత్, చైనా సేనల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవాధీన రేఖ వెంట ఇరు దేశాల సైన్యం వెనక్కు తగ్గాలని ఒప్పందం చేసుకున్నా... చైనా సైనికులు టెంట్లు వేసి హల్ చల్ చేయటంతో వివాధం మొదలైంది. ఈ వివాదంలో భారత్ సైనికులు 20 మంది చనిపోగా.. చైనాకు సైనికులు 40 మంది చనిపోయారు. అయితే, చైనా చనిపోయిన తన సైన్యం విషయంలో మౌనం వహిస్తుంది. ఎంత మంది చనిపోయారో.. అధికారికంగా ప్రకటించలేదు.

అయితే, చైనా దొంగ దెబ్బ తీసి.. 20 మంది భారత్ జవాన్లను పొట్టన పెట్టుకోవడంపై భారతీయులు.. చైనా వస్తువులను నిషేదించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story